Andhra Pradesh వాహనమిత్ర పథకం 2025 : ఆటోడ్రైవర్లకు దసరా కానుక – రూ.15,000 ఆర్థిక సాయం + రూ.2.5 లక్షల హెల్త్ ఇన్స్యూరెన్స్

ఆటో డ్రైవర్లకు దసరా కానుక

ఆటో డ్రైవర్లు అంటే మన రోజువారీ జీవితంలో ఒక ముఖ్యమైన భాగం. స్కూళ్లకు పిల్లలను తీసుకెళ్లడం నుంచి, ఆఫీస్ వెళ్లే ఉద్యోగులు, షాపింగ్‌కు వెళ్ళే గృహిణులు, అత్యవసర సందర్భాల్లో ఆసుపత్రులకు చేరుకోవడంలో ఆటోలు ఒక అండగా ఉంటాయి. వీరిని లేకుండా మన ఊహించడం కూడా కష్టమే. అయితే నిజం ఏమిటంటే, ఈ ఆటోడ్రైవర్లు రోజువారీ ఆదాయంతోనే జీవనం సాగించేవారు. ఇంధన ధరలు పెరగడం, వాహన రిపేర్ ఖర్చులు, మరియు తాజాగా బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం వంటి